Site icon TeluguMirchi.com

Nithiin: రూమర్ నిజమైతే టాలీవుడ్‌ షేక్ అవ్వడం ఖాయం.. నితిన్, రుక్మిణి వసంత్ కొత్త సినిమా వెనుక అసలు కథ ఇదేనట!

Nithiin

Nithiin: టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్, రొమాంటిక్ సినిమాలతో మెప్పించే ఆయన, ఈసారి ఒక విభిన్నమైన సామాజిక కథాంశాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అమితంగా నచ్చేసిన కన్నడ క్రష్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో నితిన్ సరసన కథానాయికగా నటించనుందని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.

ఈ సినిమా ‘సెక్స్ ఎడ్యుకేషన్’ (Sex Education) అనే సున్నితమైన, సమాజానికి ఎంతో అవసరమైన థీమ్ చుట్టూ తిరగనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. మన సమాజంలో ఇప్పటికీ ఈ విషయంపై మాట్లాడటానికి చాలామంది సంకోచిస్తుంటారు. అలాంటి ఒక ప్రాముఖ్యమైన సామాజిక అంశాన్ని తీసుకుని.. ఎక్కడా శృతిమించకుండా, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఎంటర్‌టైనింగ్ వేలో డైరెక్టర్ ఈ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే విభిన్నమైన చిత్రంగా నిలిచిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ కాంబో, బోల్డ్ లైన్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version