
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై అభిమానులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తాజాగా హీరోయిన్ ఎంపికపై మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వాణీ నటించే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ – కియారా కలిసి వెండి తెరపై నటించలేదు. దీంతో ఈ కొత్త కాంబినేషన్‌పై అభిమానుల్లో సరికొత్త హైప్ నెలకొంది.
ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కథలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో కియారా అద్వాణీ నిజంగానే ఈ ప్రాజెక్ట్‌లో భాగమైతే ఆమె పాత్ర కూడా బలంగా ఉండే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇటీవల పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న కియారా, ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. హీరోయిన్ ఎంపికపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే, ఎన్టీఆర్ – కియారా జోడీని తొలిసారి వెండితెరపై చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
