Site icon TeluguMirchi.com

ONE/4 : యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా ‘వన్ బై ఫోర్’… సెప్టెంబర్‌లో విడుదల..!

Onebyfour
బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్-క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్ (ONE/4)’ సెప్టెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. వెంకటేష్ పెద్దపాలెం హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోయిన్లుగా నటించారు. టెంపర్ వంశీ, ఆర్‌ఎక్స్ 100 కరణ్ విలన్ పాత్రల్లో నటించారు, వీరి పాత్రలు సినిమాకు మరింత బలం చేసుకుర్చనున్నాయి.

తేజస్ గుంజల్ ఫిలిమ్స్ మరియు రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ పతాకాలపై నిర్మితమైన ఈ చిత్రాన్ని రంజన రాజేష్ గుంజల్ మరియు రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించారు. మొత్తం చిత్రీకరణ విశాఖపట్నంలో జరిగింది. “ఓ మాట నోరుజారితే జరిగే ప్రమాదం ఏమిటి? దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి?” అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం, కొత్తదనంతో, సరికొత్త థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా రూపొందించబడింది.

ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. చిత్రానికి సంబంధించిన టీజర్, పాటలు ఇప్పటికే టి-సిరీస్ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదలై మంచి స్పందనను పొందాయి. సినిమా నూతనంగా, ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా ఉంటుందని యూనిట్ సభ్యులు వెల్లడించారు. సెప్టెంబర్‌లో థియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

చిత్రం పేరు: వన్ బై ఫోర్ (one/4)

నటి నటులు: వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని, టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, నరేంద్ర వర్మ, రాజు, అపర్ణ శెట్టి, మధుసూదన్ రావు, సునీత మనోహర్, శ్రీనివాస్ భోగిరెడ్డి, వేడిష్ జవేరి, కుష్బూ, సుజాత, ఎస్ ఆర్ ఎస్ వర్మ, సుహాని వ్యాస్, తదితరులు

దర్శకుడు: బాహుబలి పళని కె

నిర్మాతలు: రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్

సంగీతం: సుభాష్ ఆనంద్

డి ఓ పి: గుణ శేఖర్

లిరిక్స్: సాగర్ నారాయణ ఎమ్. నాగేంద్ర గోపు
డాన్స్: సాగర్ వేలూరు
స్టంట్ మాస్టర్: కుంగ్ ఫు చంద్ర, జాషువా
వి ఎఫ్ ఎక్స్: నవీన్ ఏ, పవన్ నారావా
ఎస్ ఎఫ్ ఎక్స్: పురుషోత్తం రాజు
మిక్సింగ్: జయంతం సురేష్
డిజిటల్ మార్కెటింగ్: వంశి కృష్ణ (సినీ డిజిటల్)

Exit mobile version