Site icon TeluguMirchi.com

Operation Ganga: మోహన్‌లాల్ ‘L367’ టైటిల్ ఇదే.. ‘ఆపరేషన్ గంగా’గా అధికారిక ప్రకటించిన సూపర్ స్టార్!

Operation Ganga

Operation Ganga: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌పై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటివరకు ‘L367’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకు ‘Operation Ganga — A Nation’s Promise’ అనే టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. విష్ణు మోహన్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. పలు వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్నప్పటికీ, సాధారణ ఆర్మీ నేపథ్యంగా ఉండదని మేకర్స్ చెబుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, భాగ్యశ్రీ బోర్సే, ఆర్.పార్తీపన్, ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

2026 జనవరిలో ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి మేకర్స్ వరుసగా విడుదల చేసిన ప్రమోషన్ కంటెంట్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా రాకెట్ విజువల్‌తో పాటు ‘05 09 26’ అనే తేదీని హైలైట్ చేస్తూ విడుదల చేసిన టీజర్లతో అసలు సినిమా ఏంటి? అనే ఆసక్తి నెలకొంది. తాజాగా ‘Operation Ganga — A Nation’s Promise’ అనే టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విజువల్స్‌ను రిలీజ్ చేయడంతో మోహన్‌లాల్ అభిమానుల్లో జోష్ మొదలైంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్.. కథ, కాన్సెప్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. పలు వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా.. కేవలం ఆర్మీ యాక్షన్ డ్రామాగా కాకుండా దేశం, మానవత్వం, బాధ్యత వంటి అంశాలను కూడా టచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. భారీ తారాగణం, పాన్-ఇండియా అప్పీల్‌తో ‘ఆపరేషన్ గంగా’పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఫస్ట్ లుక్ తర్వాత ఈ సినిమా ఎలాంటి అనుభూతిని అందించబోతోందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

Exit mobile version