Site icon TeluguMirchi.com

పవర్ స్టార్ బర్త్ డే రోజున ‘OG 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. నవంబర్ నుంచి షూటింగ్ షురూ!

OG

OG 2: పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ ఫ్యాన్స్‌కు ఆయన బర్త్ డేకి మించిన పెద్ద పండగ మరొకటి ఉండదు. గతేడాది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘OG’ (They Call Him OG) చిత్రానికి సీక్వెల్‌గా ‘OG 2’ రాబోతున్నట్లు ఇప్పటికే పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా హింట్ ఇచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ సాలిడ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ‘OG 2’ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుజీత్ OG 2 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా పోస్టర్ లేదా చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

పవన్ కల్యాణ్ తన రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ క్రేజీ సీక్వెల్ కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయించినట్లు సమాచారం. డైరెక్టర్ సుజీత్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌ను వంద శాతం పూర్తి చేయగా, నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌కి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన తమన్ ఈ సీక్వెల్‌కు కూడా సంగీతాన్ని అందిస్తుండగా, ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామి కానుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version