Site icon TeluguMirchi.com

Trance of OMI : ‘ఓజీ’ నుంచి ‘ఓమి ట్రాన్స్’ విడుదల.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!

Og omi trance
Trance of OMI : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ’ మూవీ నుంచి విడుదలైన ‘ఓమి’ గ్లింప్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తాజాగా, చిత్ర బృందం ఈ గ్లింప్స్‌కు పూర్తి వెర్షన్ అయిన ‘ఓమి ట్రాన్స్’ ను రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ (ఓజాస్) మరియు ఇమ్రాన్ హష్మీ (ఓమీ) మధ్య ఉత్కంఠభరితమైన ముఖాముఖి పోరాటాన్ని చూపించే ఈ పాట, తమన్ ఎస్ సంగీతం, ఉరుములు మరియు మెరుపులను తలపించే బీట్స్‌తో ప్రేక్షకులను ట్రాన్స్‌లోకి తీసుకెళ్తుంది. ఈ బీట్ తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం. అంతేకాదు సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది.

దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫాన్ గా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో గర్జిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి తారాగణం చిత్రంలో నటిస్తుంది. ‘ఓజీ’ సినిమా సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Exit mobile version