Site icon TeluguMirchi.com

OG Universe: 70 శాతం పూర్తయిన ‘ఓజీ’ ప్రీక్వెల్ స్క్రిప్ట్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే!

Adhika masa purnima (1)

OG Universe: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను ఊపేసే మరో క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. గతేడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ఓజీ’ (OG) చిత్రానికి ప్రీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే దాదాపు 70 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇటీవలే ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్‌పై ‘ఓజీ యూనివర్స్’ను అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన ఈ కథా చర్చల వీడియో చూశాక అభిమానుల్లో సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి. ఓజీ 2 చిత్రం పూర్తిగా ప్రీక్వెల్‌గా ఉంటుందని సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో భాగంలో ముంబైని శాసించిన ‘ఓజస్ గంభీర’ అసలు మూలాలు ఎక్కడ ఉన్నాయి? అతని గతంలో జరిగిన కథేంటి? అసలు ఓజీగా ఎలా మారాడు? అనే ఆసక్తికరమైన అంశాలను డైరెక్టర్ సుజీత్ ఈ ప్రీక్వెల్‌లో చూపించబోతున్నారట. జపాన్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు మరిన్ని పవర్‌ఫుల్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు కూడా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎనర్జిటిక్ సంగీతాన్ని అందించనున్నారు. పవన్ కళ్యాణ్ స్వంత బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కానుందనే దానిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘ఓజీ’ సృష్టించిన ప్రభంజనం తర్వాత ఈ ప్రీక్వెల్ అనౌన్స్‌మెంట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.

Exit mobile version