Site icon TeluguMirchi.com

OG OTT : ‘ఓజీ’ ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Og
OG OTT : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ ‘ఓజీ’. సాహూ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. థమన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించి, పలు రికార్డులు సృష్టించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌, లుక్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇప్పుడీ సూపర్ హిట్ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకోగా, తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. అక్టోబర్ 23వ తేదీ నుంచి ‘ఓజీ’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు‌తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో మంచి విజయం అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version