
OG : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరోవైపు సినీ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మేకర్స్ రెండో పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ రొమాంటిక్ లుక్‌లో పోస్టర్‌లో దర్శనమిచ్చారు. దీపాల వెలుగులో మెరిసిపోతున్న ఆ లుక్‌తో పాటు, అభిమానుల దృష్టిని ఆకర్షించినది పవన్ కుడి చేతిపై కనిపించిన జపనీస్ టాటూ.
ఆ టాటూలో మూడు అక్షరాలు ఉండగా, వాటి అర్థంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. అభిమానులు షేర్ చేస్తున్న సమాచారం ప్రకారం — మొదటి అక్షరానికి ‘ప్రామిస్’ (వాగ్దానం), రెండో అక్షరానికి ‘స్ట్రెంగ్త్’ (బలం), మూడో అక్షరానికి ‘ఫైర్’ (నిప్పు) అని అర్థమవుతోందని చెబుతున్నారు. ఇవి సినిమాలో పవన్ పాత్ర స్వభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, తొలి పాటతో భారీ అంచనాలు పెంచిన ‘ఓజీ’, ఈ టాటూ చర్చతో మరింత హైప్‌ను సొంతం చేసుకుంది. పవన్ లుక్, ఆయన పాత్ర డిజైన్‌పై ప్రేక్షకుల్లో కుతూహలం మరింత పెరిగింది.
