Site icon TeluguMirchi.com

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్లైమాక్స్ పూర్తి – పవన్ డెడికేషన్ కి షాక్ అవ్వాల్సిందే!

Ubs
Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు హరి హర వీరమల్లు వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, సినిమా షూటింగ్‌లోనూ ఎనర్జీతో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ డెడికేషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ ప్రొఫెషనలిజానికి ఇదొక నిదర్శనం.

తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ సీన్ చిత్రీకరణను పూర్తి చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలకు, యాక్షన్‌కు ప్రాధాన్యతనిస్తూ ఈ సీక్వెన్స్‌ను రూపొందించగా, కొరియోగ్రాఫర్ నబకాంత మాస్టర్ దీన్ని ఆకట్టుకునే విధంగా మలిచారు. పవన్ కళ్యాణ్ ఈ సీన్‌లో తన ప్రదర్శనతో చిత్రబృందాన్ని, అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. షూటింగ్ పూర్తయ్యాక ఫైటర్లతో కలిసి ఫోటోలు దిగుతూ వారందరినీ అభినందించిన పవన్, తన కష్టపడి పనిచేసే స్వభావాన్ని మళ్లీ ఒకసారి చాటిచెప్పారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పార్థిబన్, కె.ఎస్.రవికుమార్, రాంకీ, నవాబ్ షా, అవినాష్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇక పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకులందరూ ఈ సినిమా విడుదలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version