Site icon TeluguMirchi.com

Payal Rajput : పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం.. తండ్రి మృతి!

Payalrajput
Payal Rajput : టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్ (వయసు 68) జూలై 28న హైదరాబాద్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు జూలై 30న ఢిల్లీలో నిర్వహించనున్నారు. తండ్రి మృతిపై భావోద్వేగంతో స్పందించిన పాయల్, “నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

‘RX 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన పాయల్ ప్రస్తుతం ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెంకటలచ్చిమి’ సినిమాలో నటిస్తోంది. ఆమె తండ్రి మృతిపై అభిమానులు, ప్రముఖులు, సినీ పరిశ్రమ వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె త్వరగా విషాదం నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Exit mobile version