Site icon TeluguMirchi.com

Fauzi Glimpse: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ఆగస్ట్ 15న ‘ఫౌజీ’ గ్లింప్స్?

Fauzi

Fauzi Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక సరికొత్త అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అటు ఇండస్ట్రీలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఈ ఏడాది ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

అంతేకాకుండా ఆ గ్లింప్స్‌లోనే సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు టాక్. అందుకే గ్లింప్స్ రిలీజ్‌కు ఆగస్ట్ 15 కంటే సరైన సందర్భం మరొకటి ఉండదని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేయగా.. ఇప్పుడు ఆగస్ట్ 15న రాబోయే గ్లింప్స్ కోసం ‘డార్లింగ్’ ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version