
Fauzi: పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా ఒక సంచలన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం భారీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.
ఈ ఒప్పందంలో భాగంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ మేకర్స్‌కు ఒక కీలకమైన డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ నాటికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని కండిషన్ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ క్రేజీ డీల్ – డెడ్‌లైన్ నేపథ్యంలో, చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగాన్ని మరింత పెంచిందట. నెట్‌ఫ్లిక్స్ ఫిక్స్ చేసిన సమయానికి అవుట్‌పుట్‌ను పక్కాగా రెడీ చేసేందుకు టెక్నికల్ టీం రాత్రింబగళ్లు శ్రమిస్తోందని చెబుతున్నారు. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే ఆగస్టు నెలలో ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ సైనికుడి పాత్రలో కనిపించనుండగా, ఇమాన్వి హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు నటిస్తున్నారు.
