Site icon TeluguMirchi.com

Spirit: ఇండియన్ మూవీ హిస్టరీలోనే అత్యంత ‘వయలెంట్’ సినిమా.. సందీప్ వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’పై షాకింగ్ లీక్!

Spirit

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). తాజాగా ఈ సినిమా గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక షాకింగ్ అప్‌డేట్ తెగ వైరల్ అవుతోంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వయలెన్స్‌కు సరికొత్త పంథా చూపించిన సందీప్ రెడ్డి వంగా.. ఈసారి ‘స్పిరిట్’తో అంతకుమించిన విధ్వంసాన్ని సృష్టించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.

‘స్పిరిట్’ మూవీ ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత వయలెంట్ అండ్ బ్రూటల్ (Most Violent & Brutal) సినిమాగా నిలవబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా ఈ స్క్రిప్ట్‌ను పూర్తిగా రా (Raw) అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రెడీ చేశారట. ఈ సినిమాలో మధ్య మధ్యలో వచ్చే పాటలు మాత్రమే ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇస్తాయని, మిగతా సినిమా మొత్తం నాన్-స్టాప్ యాక్షన్ అండ్ హై-వోల్టేజ్ డ్రామాతో ఊపిరి సలపకుండా సాగుతుందని ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఖాకీ డ్రెస్ వెనుక ప్రభాస్‌ను ఇప్పటివరకు ఏ దర్శకుడూ చూపించని ఒక అత్యంత వైలెంట్, పవర్‌ఫుల్, రగ్గడ్ అవతార్‌లో సందీప్ వంగా ప్రెజెంట్ చేయబోతున్నారట. ప్రభాస్ క్యారెక్టరైజేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు టాక్. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ త్వరలోనే రిలీజ్‌కు రెడీ కాబోతుంది. ‘యానిమల్’ను మించిపోయేలా ఉండబోతున్న ఈ యాక్షన్ అరాచకాన్ని వెండితెరపై చూడటానికి రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Exit mobile version