
Prabhutva Sarai Dukanam Teaser : ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్, శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాగా నేడు ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు.
జంతువుల లక్షణాలు కలిగిన మనుషుల కథ అంటూ ఆరంభమైన టీజర్ పల్లెటూరి వాతావరణం, గ్రామీణ రాజకీయాల్లో స్త్రీల పాత్ర, సారాయి దుకాణం చుట్టూ జరిగే సంఘటనలను బలంగా చూపించింది. అయితే, టీజర్ అందరినీ ఆకట్టుకుంటూనే, కొంచెం షాక్ కూడా ఇస్తోంది. సాధారణంగా రూరల్ సెట్టింగ్స్‌కి కాస్త మాస్ టచ్ ఇస్తారు కానీ, ఈసారి మాత్రం క్రియేటర్స్ చాలా బోల్డ్‌గా, నేటివిటీకి తగ్గట్లే రియలిస్టిక్ యాటిట్యూడ్‌తో ప్రెజెంట్ చేశారు. బూతులు ఎక్కువగా వినిపించడంతో పాటు, కొన్ని సన్నివేశాలు ఓ రేంజ్‌లోనే వున్నాయి. మరి టీజరే ఇలా ఉంటే.. ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మొత్తానికి, ఈ టీజర్ చూసిన తర్వాత సినిమా కాస్త డిఫరెంట్‌గా, రూరల్ మాస్ ఎంటర్టైనర్‌గా రాబోతోందన్న అంచనాలు పెరిగాయి.
