Site icon TeluguMirchi.com

Producer Council Elections లో నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ మధ్య మాటామాటా!

Cinema (1)

Producer Council Elections: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రెజరర్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిర్మాత నట్టి కుమార్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరఫున ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా బరిలో ఉన్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఓట్ స్లిప్ కౌంటర్ వద్ద బెక్కెం వేణుగోపాల్ నిలబడటంపై నట్టి కుమార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ ప్రదేశంలో నిలబడకుండా బయటకు వెళ్లాలని, పలకరింపులు ఏమైనా ఉంటే బయట చేసుకోవాలని నట్టి కుమార్ సూచించినట్లు సమాచారం.

అయితే తాను ఎలాంటి క్యాన్వాసింగ్ చేయడం లేదని బెక్కెం వేణుగోపాల్ స్పష్టం చేశారు. తన వద్ద ఎలాంటి పాంప్లెట్లు కూడా లేవని, కేవలం తోటి నిర్మాతలను పలకరించేందుకే ఓట్ స్లిప్ కౌంటర్ వద్దకు వచ్చినట్లు ఆయన వివరించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో నిర్మాత సి.కళ్యాణ్ వెంటనే ఇద్దరి మధ్యకు వచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం. ఆయన జోక్యంతో కొద్దిసేపటి తర్వాత నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ శాంతించడంతో వివాదం సద్దుమణిగింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version