Site icon TeluguMirchi.com

Slumdog: బాక్సాఫీస్ వద్ద పూరి జగన్నాథ్ వైల్డ్ కమ్‌బ్యాక్.. ‘స్లమ్‌డాగ్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!

Adhika masa purnima

Slumdog: టాలీవుడ్‌లో మాస్ డైరెక్టర్ అంటే మొదట గుర్తుకు వచ్చే పేరు పూరి జగన్నాథ్. ఆయన హీరోలకు ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండవు. పూరి అభిమానులు ఆయన నుంచి ఒక వైల్డ్ కమ్‌బ్యాక్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’. ఈ సినిమాకు సంబంధించి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటులు బ్రహ్మాజీ, బ్రహ్మానందం కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. పూరి జగన్నాథ్ స్వయంగా ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించడంతో పాటు సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. పూరి జగన్నాథ్ మార్క్ హై-వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్-ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 8న రాబోయే టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version