GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శిరీష గారి సమర్పణలో రూపొందుతున్న కొత్త చిత్రం “R”. గోలి రామకృష్ణ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నేడు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
ఈ చిత్రంలో సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అశోక రెడ్డి కంకల్ల, ఎడిటర్‌గా మునీష్, కొరియోగ్రాఫర్‌గా శివాజీ పనిచేస్తున్నారు. చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా కడవకల్లు గణేష్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వేదాంత్ రాజ్ వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది అక్టోబర్ 17న “R” చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత గోలి రామకృష్ణ మాట్లాడుతూ, “మా దగ్గర ఉన్న బలమైన కథతో రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పూర్తి చేస్తాము. మంచి సందేశాత్మక చిత్రంగా ‘R’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర విశేషాలను త్వరలోనే విభిన్నమైన శైలిలో తెలియజేస్తాం” అని తెలిపారు.
సహ నిర్మాత గాలి బాల కిరణ్ రెడ్డి మాట్లాడుతూ, “మా దర్శకుడికి సినిమాపై ఉన్న నమ్మకం కారణంగా చిత్ర విడుదల తేదీని ఇప్పుడే ప్రకటించాం” అని అన్నారు.
నటీనటులు:
సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, దుర్గమ నాయుడు, పవన్, సిరి, సంధ్య, భాను చందర్, స్వాతి తదితరులు.

