Site icon TeluguMirchi.com

సల్మాన్ ఖాన్‌కు విలన్‌గా రాహుల్ దేవ్? #SVC63 పై వైరల్ అవుతున్న లేటెస్ట్ అప్డేట్!

SVC63

#SVC63: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన నెక్ట్స్ చిత్రం #SVC63 తో బాక్సాఫీస్ వద్ద బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం మేకర్స్ నటీనటులను ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌ను ఢీ కొట్టబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే సల్మాన్ ఖాన్‌తో కలిసి ఆయన షూటింగ్‌లో పాల్గొననున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో రాహుల్ దేవ్ తనదైన విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, ఇప్పుడు మరోసారి సల్మాన్ ఖాన్‌కు ఎదురుగా నిలవబోతున్నారనే వార్త అభిమానుల్లో ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. అంతేకాదు, ఈ సినిమాలో నటిస్తున్న ఇతర తారాగణం వివరాలు కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి స్టార్‌కాస్ట్ వెల్లడిస్తే అభిమానులు ఆశ్చర్యపోతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఈ విషయాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ పైడిపల్లి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఇటీవల వరుస చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన నేపథ్యంలో #SVC63 ఆయనకు అత్యంత కీలక ప్రాజెక్ట్‌గా మారింది. దీంతో ఈ సినిమాను అన్ని అంశాల్లో భారీ స్థాయిలో రూపొందించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version