
Seyon: లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో, స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సేయోన్’. తాజాగా ఈ చిత్ర బృందంలోకి మరో పవర్‌ఫుల్ యాక్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే కన్నడ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా, దర్శకుడిగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రాజ్ బి శెట్టి. తాజాగా ఆయన ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
రాజ్ బి శెట్టి పుట్టినరోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ క్రేజీ అప్‌డేట్‌ను పంచుకుంది. “కాస్టింగ్ మరింత పవర్‌ఫుల్‌గా మారింది.. వేడుక మరింత పెద్దదైంది.. వెల్‌కమ్ అబోర్డ్ రాజ్ బి శెట్టి” అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. శివకుమార్ జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మహేంద్రన్, టర్మెరిక్ మీడియా సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. రాజ్ బి శెట్టి లాంటి వెర్సటైల్ యాక్టర్ ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ వెల్‌కమ్ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.
