
Raashii Khanna: కోలీవుడ్‌లోనే కాదు.. టోటల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రేజీ కాంబినేషన్ రజనీ – కమల్‌ది. అలాంటిది సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా ‘రాజ్‌కమల్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఒక భారీ చిత్రం పట్టాలెక్కబోతుంటే దానిపై హైప్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించగలం. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక సంచలన విషయం ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో కీలకమైన హీరోయిన్ పాత్ర కోసం టాలీవుడ్, కోలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ ఎంపిక వెనుక కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు నటనతో పాటు మంచి గ్లామర్ ఉన్న నటి కావాలని మేకర్స్ భావించారట. ఈ క్రమంలోనే రాశి ఖన్నా అయితే ఈ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్ జస్టిస్ చేయగలదని శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్‌కు రికమండేషన్ చేసినట్లు గట్టిగా ప్రచారం జరుగుతుంది. రాశి ఖన్నా నటన, ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని శృతి చేసిన ఈ రికమండేషన్ చేసినట్లు, దీనికి కమల్ హాసన్, డైరెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన పూజాకార్యక్రమంలో మేకర్స్ ఈ చిత్రానికి ధర్మన్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్, సిమ్రన్, రాశి ఖన్నా, కమల్ హాసన్ పాల్గొన్నారు. దీంతో ఈ చిత్రంలో సూపర్ స్టార్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను రాశి ఖన్నా సొంతం చేసుకున్నట్లు తేలిపోయింది. దీంతో రాశి ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
