Site icon TeluguMirchi.com

‘Jailer 2’ రిలీజ్ డేట్ ఫిక్స్? సూపర్ స్టార్ రాక అప్పుడేనా!

Jailer

Jailer 2: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’ రిలీజ్‌పై నెట్టింట సరికొత్త లీక్ హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా దసరా, ఆయుధ పూజ సెలవుల సీజన్ సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈ లాంగ్ వీకెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు చిత్ర యూనిట్ ఆ తేదీని పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే దీనిపై సన్ పిక్చర్స్ సంస్థ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్‌లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్‌ఫుల్ క్యామియో చేయబోతున్నారట. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ షూటింగ్ జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ షూటింగ్‌లో హృతిక్ రోషన్‌ కూడా పాల్గొన్నారని సమాచారం. ఈ సినిమాలో హృతిక్‌ను ఒక కీలక రోల్‌లో కనిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన రోల్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్‌గా, హై-వోల్టేజ్ రేంజ్‌లో ఉండబోతుందని టాక్. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి, మిథున్ చక్రవర్తి వంటి స్టార్స్ కూడా భాగం కానున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్‌ని మేకర్స్ అతి త్వరలో అనౌన్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Exit mobile version