Site icon TeluguMirchi.com

Rakasa : నవ్విస్తూనే భయపెడుతున్న నిహారిక ‘రాకాస’ టీజర్

Rakasa
Rakasa : ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ స్టూడియోస్ (Zee Studios) సమర్పణలో, తన పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ (Pink Elephant Pictures) బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించిన తాజా చిత్రం ‘రాకాస’. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంగీత్ శోభన్‌, నయన్ సారిక జంటగా నటించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకోగా, తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

“నరకం నుండి సందేశం వస్తుంది.. మన ఊరి శాపమిది.. మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత” అంటూ సీరియస్ టోన్‌లో మొదలైన టీజర్, హీరో ఎంట్రీతో ఒక్కసారిగా మూడ్ మార్చేస్తుంది. భయం, కామెడీ మేళవించిన సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మధ్య మధ్యలో వచ్చే యాక్షన్ షాట్స్, థ్రిల్లింగ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చివర్లో వినిపించే “స్త్రీ.. రేపు రా” డైలాగ్ హైలైట్‌గా నిలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా కామెడీ, హారర్, యాక్షన్ మేళవింపుతో ఓ కొత్త తరహా ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version