
Peddi Pre-Sales: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద అప్పుడే విధ్వంసం సృష్టించడం మొదలుపెట్టింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం.. అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ ప్రీమియర్స్‌తో సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రీ-సేల్స్ (అడ్వాన్స్ బుకింగ్స్) ద్వారానే ఏకంగా రూ.22 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
నార్త్ అమెరికాలో 1.1 మిలియన్ డాలర్లు!
ఓవర్సీస్ మార్కెట్‌లో రామ్ చరణ్ తన క్రేజ్ మరోసారి రుజువు చేసుకున్నాడు. కేవలం నార్త్ అమెరికా ప్రీమియర్స్ ద్వారానే ఈ చిత్రం 1.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 9 కోట్లకు పైగా) మైలురాయిని దాటేసింది. ఇందులో అమెరికాలోని 610 లొకేషన్ల నుంచే 1.02 మిలియన్ డాలర్లు వసూలు కావడం విశేషం. మరోవైపు ఇండియాలోనూ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రూ.13 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి.. విడుదల రోజే భారీ ఓపెనింగ్స్ సాధించడానికి ‘పెద్ది’ సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ఒక పల్లెటూరి యువకుడు తన గ్రామం కోసం, తన ప్రజల కోసం ప్రత్యర్థులతో ఎలా పోరాడాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సానా అద్భుతంగా మలిచారని సమాచారం. ఈ మూవీలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్ల వద్ద మెగా అభిమానుల హంగామాతో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రేజ్ చూస్తుంటే జూన్ 4న బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు జోస్యం చెబుతున్నాయి.
