Site icon TeluguMirchi.com

RC17 Look Leak: చరణ్ – సుక్కు ప్రాజెక్ట్‌పై క్రేజీ లీక్!

RC17

RC17 Look Leak: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఆర్సీ 17’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు దిమ్మతిరిగే అప్‌డేట్ అందింది. ‘రంగస్థలం’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ 1న అధికారికంగా పూజా కార్యక్రమాలతో పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. అయితే, ఈ గ్రాండ్ లాంచ్‌కు ముందే రామ్ చరణ్ క్యారెక్టర్ లుక్‌కి సంబంధించి బయటకు వచ్చిన ఓ సెన్సేషనల్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

తాజాగా చిత్ర బృందం రామ్ చరణ్‌పై ఒక ప్రత్యేకమైన లుక్ టెస్ట్‌ను పూర్తి చేసినట్లు తెలిసింది. ఇందులో చరణ్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారట. పాత్ర డిమాండ్ మేరకు ఆయన బాగా బరువు తగ్గి, లాంగ్ హెయిర్‌తో అత్యంత స్టైలిష్‌గా, సన్నజాజిలా కనిపించనున్నట్లు సమాచారం. ‘రంగస్థలం’లో ఊరమాస్ చిట్టిబాబుగా మెప్పించిన చరణ్‌ను.. ఈసారి సుకుమార్ ఏ రేంజ్ అల్ట్రా స్టైలిష్ అవతారంలో చూపించబోతున్నారోనని మెగా ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

ఈ భారీ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా సారా అర్జున్ కనిపించనుందనే ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. తాజాగా జరిగిన ఫొటోషూట్‌లో చరణ్‌తో కలిసి సారా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో శరవేగంగా దూసుకుపోతున్న ఈ చిత్రం.. డిసెంబర్ నెలాఖరు నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించుకునే అవకాశాలున్నాయి. అయితే రామ్ చరణ్ మాత్రం జనవరి నుంచి నేరుగా సెట్స్‌లోకి అడుగుపెడతారని టాక్. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నవంబర్ 1న పూజా కార్యక్రమం సందర్భంగా మేకర్స్ అధికారికంగా రివీల్ చేయనున్నారు.

Exit mobile version