Site icon TeluguMirchi.com

Ram Charan: మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. RC17 కోసం మరో రెండేళ్ల ఆగాల్సిందే?

RC17

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా విడుదలల మధ్య పెరుగుతున్న గ్యాప్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా RC17 రిలీజ్‌కు సుమారు 20 నుంచి 24 నెలలు పట్టే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఆయన రిలీజ్ షెడ్యూల్‌పై గణనీయమైన ప్రభావం పడే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

రామ్ చరణ్ నటించిన RRR తర్వాత ప్రేక్షకులు ఆయన నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టింది. ఆ తర్వాత వచ్చిన పెద్ది కూడా సుమారు రెండేళ్ల విరామం తర్వాతే విడుదలైంది. దీంతో వరుసగా ఆయన సినిమాల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా పెద్ది విడుదలైన తర్వాత RC17 చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరోసారి మెగా అభిమానులు రామ్ చరణ్ సినిమా కోసం దీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇప్పటివరకు RC17 విడుదల తేదీ లేదా షూటింగ్ షెడ్యూల్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

Exit mobile version