
RC17 Update: ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ #RC17. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఎలాంటి వార్త వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ది సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం ఈ సినిమాపై పూర్తి స్థాయి ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న ఈ ప్రాజెక్ట్ ఊహించని రేంజ్లో ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ తన కెరీర్లోనే ఫస్ట్ టైం రెండు పార్ట్లు ఉండే సినిమాలో జోరుగా ప్రచారం సాగుతుంది. సుకుమార్ ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారట. పార్ట్ 1, పార్ట్ 2లను అత్యంత భారీ బడ్జెట్తో, మునుపెన్నడూ లేని విధంగా విజువల్ వండర్గా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల టాక్. గ్లోబల్ వైడ్గా క్రేజ్ సంపాదించుకున్న రామ్ చరణ్ను సుకుమార్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు. భారీ తారాగణంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా ఉండబోతోందని చెబుతున్నారు. ఇటీవలే ‘పెద్ది’ సక్సెస్ మీట్లో సుకుమార్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ.. “నేను ఇప్పుడే ఏమీ చెప్పను, అంతా మీ ఊహకే వదిలేస్తున్నా” అంటూ హింట్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్లో క్యూరియాసిటీని మరింత పెంచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ దసరా తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.
