
Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేవలం హీరోగానే కాకుండా, తొలిసారి మెగాఫోన్ పట్టి స్వీయ దర్శకత్వంలో ఓ హై-వోల్టేజ్ యాక్షన్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్పెషల్ మేకింగ్ వీడియో ప్రస్తుం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ షెడ్యూల్ మొత్తం రాత్రి వేళల్లో, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో సాగినట్లు ప్రోమో స్పష్టం చేస్తోంది.
అయితే ఇందులో అందరి దృష్టినీ ఆకర్షించింది రామ్ లుక్. గతంలో ‘రెడ్’ సినిమాలో కనిపించిన తరహాలోనే ఫుల్ గడ్డంతో పాటు, కాస్త పొడవైన జుట్టుతో విపరీతమైన రగ్గడ్ అండ్ ఇంటెన్స్ అవతారంలో రామ్ కనిపించారు. దర్శకుడిగా ప్రతి ఫ్రేమ్‌ను దగ్గరుండి చెక్కుతూనే, హీరోగా ఫైట్స్ చేస్తూ డ్యూయల్ రోల్‌లో రామ్ చూపించిన డెడికేషన్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ చిత్రంలో రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. రామ్ మేకింగ్ స్పీడ్ చూస్తుంటే, అనుకున్న సమయానికి అంటే ఈ ఏడాదే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. హీరోగా, దర్శకుడిగా రామ్ వేస్తున్న ఈ సరికొత్త అడుగు టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరతీసేలా ఉంది.
A new neo-noir vision.
A canvas built on ambition.
A spectacle taking shape. ❤️🔥#RAPO23 Second Schedule Wrapped Up!Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A @RAPO_Cinematics Production.Energetic Star @ramsayz 🐺🖤… pic.twitter.com/Sy0PhRgOUC
— RAPO Cinematics (@RAPO_Cinematics) September 22, 2026
