
Ram Pothineni: హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ఇప్పుడు ఏకంగా తన డైరెక్షన్‌లో సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఇన్సైడ్ టాక్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా బడ్జెట్‌ను మేకర్స్ అటూ ఇటుగా రూ. 45 కోట్లకు పరిమితం చేయాలని లెక్కలు వేస్తున్నారట.
అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. సాధారణంగా ఒక సినిమా బడ్జెట్‌లో హీరో రెమ్యునరేషన్ కూడా కలిసి ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రం ఈ రూ.45 కోట్ల బడ్జెట్ కేవలం ప్రొడక్షన్ కాస్ట్ (మేకింగ్, టెక్నీషియన్స్, ఇతర నటీనటుల ఖర్చులు) కోసమే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో రామ్ పోతినేని పారితోషికం లేదట. హీరో రెమ్యునరేషన్‌ను కూడా కలుపుకుంటే ఈ సినిమా బడ్జెట్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, థియేట్రికల్ బిజినెస్ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. సినిమా క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండానే, వీలైనంత వరకు అనవసరపు ఖర్చులను తగ్గించాలని చూస్తున్నారట. ఇందుకోసం ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లోనే స్క్రిప్ట్‌తో పాటు లొకేషన్స్, కాల్ షీట్స్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఈ సినిమా బృందం ముందుకు వెళ్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం మొత్తం ఈ బడ్జెట్ కసరత్తులపైనే తీవ్రంగా వర్క్ చేస్తోందని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
