
Andhra King Taluka Trailer : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్, రొమాన్స్, ఫ్యాన్ ఎమోషన్స్ కలిసిన యూనిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు మంచి స్పందన పొందాయి. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ కర్నూల్ లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో డ్రోన్ షో, ఫైర్‌వర్క్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ట్రైలర్‌లో తన ఫేవరెట్ హీరో సూర్య కోసం ఏదైనా చేయగల పిచ్చి ఫ్యాన్‌గా సాగర్ (రామ్) కనిపించాడు. థియేటర్‌లో ప్రింట్ ఆలస్యమైతే గ్లాస్ పగలగొట్టడం, ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం పోరాడటం ఇవన్నీ అతని రోజువారీ జీవితం. ఇదిలా ఉండగా, అతని ఈ పిచ్చిలో ప్రేమను చూసే అమ్మాయి కూడా ఉంది. అయితే ఒక థియేటర్ యజమాని అవమానం తర్వాత సాగర్ జీవితం మారిపోతుంది. ఆ పరిస్థితుల్లో నిజమైన స్టార్ అయిన సూర్య కూడా తన ఫ్యాన్ కోసం తన నియమాలను బ్రేక్ చేయాల్సి వస్తుంది.
రామ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టగా, భాగ్యశ్రీ బోర్సే లుక్స్, ప్రెజెన్స్ బాగున్నాయి. ఉపేంద్ర ప్రెజెన్స్ కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. రాహుల్ రామకృష్ణ కామెడీ-ఎమోషనల్ గా ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, సంగీతం, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విలువలు ట్రైలర్‌ను మరింత అందంగా చూపించాయి. మొత్తం మీద ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
