Site icon TeluguMirchi.com

Satyadev: ఫరియా, వర్ష బొల్లమ్మలతో సత్యదేవ్ మల్టీస్టారర్ సిరీస్

Trial and Error Web Series

Satyadev: వెండితెరపై ‘శివగామి’గా తన రాజసంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ, వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. వీరిద్దరితో పాటు క్రేజీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కలిసి నటిస్తున్న సరికొత్త ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ గ్రాండ్‌గా ప్రారంభమైంది. విభిన్న నటనతో ఆకట్టుకునే రమ్యకృష్ణ, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సత్యదేవ్ తొలిసారి ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాన్సెప్ట్‌ కోసం చేతులు కలపడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత శరత్ మరార్, తన నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. కమల్ హాసన్ ‘చీకటి రాజ్యం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజేశ్ ఎం. సెల్వ ఈ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ అక్టోబరు 11న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరై తొలి షాట్‌కు క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సిరీస్‌లో రమ్యకృష్ణ, సత్యదేవ్, ఫరియా అబ్దుల్లాతో పాటు టాలెంటెడ్ నటి వర్ష బొల్లమ్మ, యువ నటుడు విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. క్రైమ్, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సాగే పరిశోధనలు, అనుకోని మలుపులు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ సిరీస్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. డిజిటల్ తెరపై రమ్యకృష్ణ మరోసారి తన మార్క్ నటనతో దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Exit mobile version