Site icon TeluguMirchi.com

Rana Daggubati: హీరో ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఫస్ట్‌కు.. మారిన ఆడియన్స్ ట్రెండ్‌పై రానా ఆసక్తికర వ్యాఖ్యలు!

Rana Daggubati

Rana Daggubati: సినిమా అంటే ఒకప్పుడు హీరో ఎవరు? అనే ప్రశ్నకే ప్రేక్షకులు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. స్టార్ హీరో సినిమా అంటే కథ, దర్శకుడు ఎలా ఉన్నా థియేటర్లకు వెళ్లే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ క్రమంగా మారుతోందని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి అభిప్రాయపడ్డారు. నేటి తరం ప్రేక్షకులు హీరోతో పాటు దర్శకుడి బ్రాండ్, అతని మేకింగ్ స్టైల్‌ను కూడా గమనిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఒక సినిమాలో హీరో ఎవరు అనేదానికంటే.. ఆ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు ఎవరు అనేదానిపై కూడా ఆడియన్స్‌లో ఆసక్తి పెరుగుతోందని చెప్పారు. ముఖ్యంగా తమకంటూ ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్, బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ల సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

రాజమౌళి, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ సినిమా అనే స్థాయిలో డైరెక్టర్ల పేర్లే ఇప్పుడు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయని రానా ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలాంటి డైరెక్టర్లు ఎలాంటి స్టోరీని ఎంచుకున్నా, వారి మేకింగ్‌పై ఉన్న నమ్మకంతో సినిమాను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో వస్తున్న కీలకమైన మార్పుగా చెప్పుకోవచ్చని అన్నారు. పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరగడంతో పాటు డైరెక్టర్ల స్పెష్పల్ బ్రాండింగ్ కూడా మరింత బలపడిందని చెప్పారు. రాజమౌళి వంటి దర్శకులు తమ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి డైరెక్టర్లు తమదైన మేకింగ్ స్టైల్‌తో ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకోవడం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చని వెల్లడించారు. ఒకప్పుడు హీరోల పేర్లతో సినిమాలు మార్కెట్ అయ్యేవని.. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో డైరెక్టర్ పేరు కూడా సినిమాకు ఓపెనింగ్స్ తీసుకొచ్చే స్థాయికి చేరుకుందన్నారు. దర్శకుడి గత సినిమాలు, అతని వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్, యాక్షన్ ట్రీట్‌మెంట్, విజువల్ ప్రెజెంటేషన్ వంటి అంశాలను ప్రేక్షకులు ముందుగానే అంచనా వేస్తున్నారన్నారు. అయితే స్టార్ హీరోల ఇమేజ్ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందని దీని అర్థం కాదని చెప్పారు. హీరో, డైరెక్టర్, కంటెంట్.. ఈ మూడు కలయికే సినిమాకు బలంగా మారుతోందన్నారు. ప్రేక్షకులు ఇప్పుడు మరింత సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో రానా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version