Site icon TeluguMirchi.com

Ranabaali: ‘రణబాలి’కి కొత్త డేట్ ఫిక్స్? వైరల్ అవుతున్న బజ్ ఇదే!

Ranabaali

Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న క్రేజీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘రణబాలి’పై ఆసక్తికరమైన అప్‌డేట్‌ వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బ్రిటిష్‌ పాలన కాలం నాటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘రణబాలి’ చిత్రాన్ని తొలుత 2026 సెప్టెంబర్‌ 11న విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. అయితే షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో కొంత జాప్యం కారణంగా ఈ సినిమా సెప్టెంబర్‌ విడుదల రేసు నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్‌ 30న ‘రణబాలి’ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రష్మిక రికవరీ సంతృప్తికరంగా కొనసాగుతుండటంతో మిగిలిన షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసి అక్టోబర్‌ 30న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. అయితే ఈ కొత్త రిలీజ్‌ డేట్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ అనే పవర్‌ఫుల్‌ యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా శారీరక శిక్షణతో పాటు కత్తిసాము వంటి యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్మిక ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ‘ది మమ్మీ’ వంటి చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘రణబాలి’లో భాగం కావడంతో సినిమాపై మరింత హైప్‌ పెరిగింది. మరి అక్టోబర్‌ 30నే ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనేది అధికారిక ప్రకటనతోనే తేలనుంది.

Exit mobile version