Site icon TeluguMirchi.com

Ranabali: మిక్స్‌డ్ టాక్‌తోనూ తగ్గేదేలే.. బ్రేక్‌ఈవెన్‌కు చేరువలో ‘రణబాలి’!

Ranabali Budget

Ranabali: రిలీజ్ రోజున వచ్చిన మిశ్రమ టాక్‌తో సినిమా ఫలితం తారుమారవుతుందని భావించిన వారికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ స్టార్ పవర్‌తో గట్టి సమాధానమిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి వచ్చిన పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద అనూహ్య వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు వచ్చిన నెగెటివ్ టాక్‌ను పటా పంచలు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటం ఇప్పుడు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముఖ్యంగా దసరా పండుగ సెలవులు ఈ చిత్రానికి కొండంత అండగా నిలిచాయి. విజయ్-రష్మిక కాంబినేషన్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ తోడవడంతో పండుగ నాడు పలు సెంటర్లలో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడంతో ప్రమోషన్లలో ఈ జంట చూపించిన ఉత్సాహం ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టేలా చేసింది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ ఇప్పటివరకు దాదాపు రూ. 55 కోట్ల నుంచి రూ. 60 కోట్ల దాకా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దాదాపు 70 శాతం రికవరీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్‌ఈవెన్‌కు చేరువైంది. రాయలసీమ (సీడెడ్) ఏరియాలో ఇప్పటికే బ్రేక్‌ఈవెన్ మార్కును దాటేసి లాభాల బాట పట్టగా, ఇదే జోరు కొనసాగితే మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ వారంలోనే క్లీన్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. టాక్‌తో పనిలేకుండా కేవలం కాంబినేషన్ క్రేజ్, పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకుంటూ ‘రణబాలి’ చూపుతున్న ఈ దూకుడు విజయ్ స్టార్‌డమ్‌కు నిదర్శనమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version