Site icon TeluguMirchi.com

RaPo23లో విలన్‌గా జాకీ ష్రాఫ్?

RaPo23

RaPo23: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం #RaPo23 పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

జాకీ ష్రాఫ్ గతంలో పలు తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన #RaPo23లో విలన్‌గా కనిపిస్తున్నారనే వార్త బయటికి రావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో హీరో రామ్ పోతినేనితో ఆయన తలపడే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్, స్టైలిష్ నటనతో జాకీ ష్రాఫ్ ఈ పాత్రకు మరింత బలం చేకూరుస్తారని టాక్ వినిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రామ్ పోతినేని కెరీర్‌లోనే ఫస్ట్ టైం హీరోగా నటిస్తూనే, డైరెక్ట్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌‌పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఈ వార్తలపై పూర్తి స్పష్టత రావాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version