
Rashmika: పెళ్లి తర్వాత హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఆసక్తికర పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఒక ‘అత్యంత భయానకమైన’ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన రా లుక్‌ను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో లీక్ చేసింది. ఈ పోస్ట్‌ను షేర్ చేస్తూ.. “ఈ ఫోటో ఎక్కడ డిలీట్ అయిపోతుందోనని భయంగా ఉంది. కానీ, ఈ సీన్‌ను వెండితెరపై చూడటానికి నేను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను” అంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. వెంటనే మూవీ టీమ్ కూడా అఫీషియల్ ఈ పోస్ట్‌ను రీపోస్ట్ చేస్తూ, థియేటర్లలో ఇది ‘అరాచకం’ సృష్టించడం ఖాయం అని ప్రకటించింది.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ – రష్మిక జంటగా నటిస్తున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమాలో విజయ్ 19వ శతాబ్దానికి చెందిన ‘రణబాలి’ అనే స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో బ్రిటిష్ వలసవాద శక్తులతో పోరాడనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రష్మిక ‘జయమ్మ’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తోంది. అలాగే హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ (ది మమ్మీ ఫేమ్) ఇందులో విలన్‌గా నటిస్తుండటం విశేషం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Wait for it.
Absolute explosion on the big screens 🔥🔥#Ranabaali @TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo pic.twitter.com/jwQrRYfMOq— RANABAALI (@RanabaaliFilm) July 12, 2026
