
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (#MYSAA). తాజాగా ఈ చిత్రం నుంచి ఇండియన్ సినిమా హిస్టరీలోనే నిలిచిపోయే ఒక మైండ్‌బ్లోయింగ్ అప్‌డేట్ బయటికి వచ్చింది. రవీంద్ర పుల్లె డైరెక్షన్‌లో తెరకెక్కతున్న ఈ చిత్రం ద్వారా ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త యాక్షన్ అధ్యాయానికి మేకర్స్ శ్రీకారం చుడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అత్యంత రిస్కీ, సంచలనాత్మకమైన యాక్షన్ షెడ్యూల్‌ను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు.
సాధారణంగా భారీ యాక్షన్ సినిమాల్లో హీరోలు అండర్‌వాటర్ స్టంట్స్ చేయడం చూసుంటాం. కానీ, ‘మైసా’ మూవీ కోసం రష్మిక మందన్న సరికొత్త రికార్డు సృష్టించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం కోసం ‘ఫీమేల్ అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్’ ను ఈ సినిమా కోసం అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఎంతో రిస్క్‌తో కూడుకున్న ఈ అండర్‌వాటర్ యాక్షన్ బ్లాక్‌లో రష్మిక ఎటువంటి డూప్ లేకుండా, ప్రాణాలకు తెగించి ఫైట్స్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించారు. ఈ సంచలన పోరాట ఘట్టం వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
అన్‌ఫార్ములా ఫిల్మ్స్, ప్రతిష్టాత్మక టీ-సిరీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో, మేకర్స్ త్వరలోనే మోస్ట్ అవేటెడ్ టీజర్ అనౌన్స్‌మెంట్‌ను ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ‘మైసా’ చిత్రాన్ని ఇదే 2026లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. రష్మిక కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ మూవీగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
