Site icon TeluguMirchi.com

Mokshadha: నైజాం బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా కూతురి గురి.. మోక్షద బిజినెస్ ఎంట్రీ నిజమేనా?

Mokshada

Mokshadha: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస విజయాలు సరికొత్త జోష్ నింపుతున్నాయి. థియేటర్లకు జనం పోటెత్తుతుండటంతో సినిమా బిజినెస్‌పై టాలీవుడ్ ప్రముఖుల చూపు మరోసారి బలంగా పడింది. ఈ క్రమంలోనే సినీ నిర్మాణ, పంపిణీ రంగాల్లోకి ప్రముఖుల వారసులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా మాస్ మహారాజా రవితేజ కుమార్తె మోక్షద చిత్ర పరిశ్రమ వ్యాపార రంగంలో దూకుడు పెంచుతూ కీలక ముందడుగు వేయడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మాస్ మహారాజా డాటర్‌కి ఫస్ట్ నుంచే చిత్ర నిర్మాణం, థియేట్రికల్ బిజినెస్‌పై విపరీతమైన ఆసక్తి ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె చిత్రసీమలోని వివిధ విభాగాల పనితీరును దగ్గరుండి అధ్యయనం చేస్తూ అనుభవం గడిస్తున్నారు. హైదరాబాద్‌లోని దిల్‍సుఖ్ నగర్ ప్రాంతంలో మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్వహణను చూసుకోవడంతో పాటు, రవితేజ నటించే చిత్రాల కంటెంట్ ఎంపిక, స్క్రిప్ట్ విశ్లేషణల్లోనూ ఆమె పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా చిన్న చిత్రాల నిర్మాణంలోనూ ఇప్పటికే అడుగులు వేశారు.

అయితే, ఇటీవల నైజాం పంపిణీ రంగంలోకి ఆమె చేసిన ప్రయోగం ఊహించని సక్సెస్ సాధించడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇటీవల విడుదలైన ‘ఇరుముడి’ చిత్ర నైజాం రైట్స్‌ను కొనుగోలు చేసి సొంతంగా విడుదల చేయగా, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్య లాభాలను తెచ్చిపెట్టింది. తొలి ప్రయత్నంలోనే బిజినెస్ పరంగా సూపర్ హిట్ అందుకోవడంతో.. ఇకపై నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్‌పై మోక్షద పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం తండ్రి స్టార్‌డమ్‌పై ఆధారపడకుండా, పక్కా కమర్షియల్ ప్లానింగ్‌తో నైజాం పంపిణీ రంగంలో చక్రం తిప్పేందుకు ఆమె రెడీ అవుతున్న తీరు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Exit mobile version