
Ravi Teja: టాలీవుడ్‌లో మరో సంచలన కాంబినేషన్‌కు తెరలేవబోతోంది. మాస్ మహారాజా రవితేజ, వైవిధ్యభరితమైన పాత్రలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శ్రీవిష్ణు తొలిసారి కలిసి ఒకే స్క్రీన్‌పై సందడి చేయనున్నారని ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ భారీ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు.
‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి విభిన్న చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రవితేజ మార్క్ ఎనర్జీ, శ్రీవిష్ణు టైమింగ్‌కు సరిపోయేలా ఒక వినూత్నమైన కమర్షియల్ ఎంటర్టైనర్ కథను ఆయన రెడీ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘అక్కాయిలూ… బాగున్నారా?’ అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. గతంలో దిల్ రాజు నిర్మాణంలో రవితేజ చేసిన ‘రాజా ది గ్రేట్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్టుపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం పూర్తి కాగానే ఈ కొత్త సినిమా పట్టాలెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
