
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు టాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మాస్ మహారాజా తదుపరి సినిమా చేయనున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉందని సమాచారం. ఈ మేరకు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది.
అయితే అనూహ్య పరిణామాలతో మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు ఎవరు చేపడతారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో గతంలో ఎస్‌వీసీ సంస్థలో పనిచేసిన లక్ష్మణ్ ఈ ప్రాజెక్ట్‌ను టేకోవర్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. మైత్రి సంస్థ తప్పుకోవడం, కొత్త నిర్మాత రంగంలోకి దిగడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిర్మాతలు, చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం విశేషం. ఇరుముడి రిలీజ్ తర్వాత వివేక్ ఆత్రేయతో చేయనున్న కొత్త చిత్రంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రవితేజ మాస్ ఇమేజ్‌కు వివేక్ ఆత్రేయ స్టైలిష్ టేకింగ్ జతకానుండటంతో ఈ కాంబోపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
