Site icon TeluguMirchi.com

మెగా ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ న్యూస్.. RC17 షూటింగ్ ఎప్పుడంటే?

RC17

RC17: ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి కలిసి పనిచేస్తున్న చిత్రం RC17. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు రూ.600-800 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు చూడని స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందించేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్‌ను ఆయన ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

RC17కు అక్టోబర్‌లో దసరా సందర్భంగా గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం డిసెంబర్ 2026 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల చేయించుకున్న సర్జరీ నుంచి కోలుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్టుగా తన ఫిజిక్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ కొత్త లుక్, స్టైలిష్ యాక్షన్ అవతార్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ‘Lean. Mean. Unseen.’ అనే ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో RC17లో చరణ్‌ను సుకుమార్ ఎలా చూపించబోతున్నారనే దానిపై ఇప్పుడు ఆసక్తి మరింత పెరిగింది. ‘రంగస్థలం’ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో RC17పై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కబోతున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Exit mobile version