
Toxic: కేజీఎఫ్ (KGF) సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (#Toxic). గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్, కాస్టింగ్ పరంగా ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా రెమ్యూనరేషన్ బిల్లుకు సంబంధించిన ఒక మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ నెట్టింట తెగ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలోని నటీనటుల పారితోషికాల మొత్తమే ఏకంగా రూ.100 కోట్ల మార్కును దాటేసినట్లు సమాచారం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. హీరో యష్ ఈ సినిమా కోసం ఒక తెలివైన బిజినెస్ వ్యూహాన్ని ఎంచుకున్నారట. ఆయన ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకోకుండా.. కేవలం రూ.50 కోట్లను అడ్వాన్స్‌గా తీసుకున్నారట. అయితే ఈ చిత్రానికి యష్ కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తుండటంతో, సినిమా లాభాల్లో పెద్ద మొత్తంలో షేర్ తీసుకోబోతున్నారట. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయితే యష్‌కు లాభం ఊహించని స్థాయిలో ఉండబోతోంది. ఈ సినిమా కోసం యష్ పారితోషికం ఒక ఎత్తయితే.. హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా మైండ్ బ్లాక్ చేస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.15 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకుంటుండగా.. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం రూ.12 కోట్ల మేర డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల జీతాలు అన్నీ కలుపుకుంటే కేవలం రెమ్యూనరేషన్ బడ్జెట్ మాత్రమే రూ.100 కోట్లకు పైగా దాటిపోయిందట.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ భారీ బడ్జెట్ లెక్కలు చూస్తుంటే యష్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
