Site icon TeluguMirchi.com

Sai Durga Tej: ‘క’ డైరెక్టర్స్‌తో సాయి దుర్గా తేజ్ భారీ హిస్టారికల్ ఫిక్షన్.. టైటిల్ ఇదేనా?

Sai Durga Tej

Sai Durga Tej: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో సాయి దుర్గా తేజ్. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. గత ఏడాది ‘క‌’ చిత్రంతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న ద‌ర్శ‌క‌ద్వ‌యం సుదీప్ – సందీప్‌ ఇప్పుడు వారి నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సుప్రీం హీరోతో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ భారీ హిస్టారిక‌ల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫిక్ష‌న్ చిత్ర‌మట. చరిత్రకు కల్పిత గాథను జోడించి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కథను రూపొందించినట్లు టాక్. అంతేకాదు, ఈ సినిమాకు మేకర్స్ ప్రస్తుతం ‘విక్ర‌మార్క‌’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. టైటిల్ వినడానికి చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో మెగా ఫ్యాన్స్‌లో అప్పుడే ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది అక్టోబ‌రు నుంచి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. సాయి దుర్గా తేజ్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా, అలాగే సుదీప్-సందీప్‌ల మార్క్ మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో ఈ హిస్టారికల్ డ్రామా ఉండబోతోందని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

Exit mobile version