Site icon TeluguMirchi.com

సల్మాన్ ఖాన్ ‘#SVC63’ రిలీజ్ డేట్ ఫిక్స్..

SVC63

SVC63: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘#SVC63’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ ప్లాన్స్‌పై నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమాపై ఉన్న హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. “ఇదొక భారీ హంగులతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్. సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన గతంలో ఎన్నడూ చూడని విధంగా పలు రకాల భిన్నమైన గెటప్స్, లుక్స్‌లో కనిపించి అలరించబోతున్నారు. కథలో ప్రేక్షకులను థ్రిల్ చేసే అద్భుతమైన ‘వావ్’ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రలో నటిస్తున్నారు ” అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

షూటింగ్ అక్టోబర్‌కే పూర్తి అవుతునప్పటికీ.. విజువల్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం తగినంత సమయం తీసుకుని, ఈ భారీ చిత్రాన్ని మార్చి 2027 లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి టార్గెట్‌గా పెట్టుకున్నట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్‌కు వంశీ పైడిపల్లి క్లాస్ ఎమోషన్స్ తోడవుతుండటంతో.. 2027 మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాల్లో ‘#SVC63’ ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version