Samantha: సౌత్ ఇండియన్ టాప్ స్టార్ సమంత రూత్ ప్రభు మరోసారి నార్త్ అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (#MaaIntiBangaaram) యూఎస్ఏలో ఘన విజయం సాధించడమే కాకుండా.. తాజాగా ప్రతిష్టాత్మక మిలియన్ డాలర్ క్లబ్ ($1 Million) లోకి అడుగుపెట్టింది. ఈ విజయంతో సమంత ఓవరాల్‌గా ఇండియన్ సినిమా హిస్టరీలోనే మరే నటికి సాధ్యం కాని సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ‘అన్‌క్రౌండ్ క్వీన్’గా సమంత నిలిచారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమాతో కలిపి సమంత కెరీర్‌లో ఇప్పటివరకు 18 సినిమాలు మిలియన్ డాలర్ల మార్కును అందుకున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్‌కు కూడా నార్త్ అమెరికాలో ఇన్ని మిలియన్ డాలర్ల సినిమాలు లేవు. కేవలం హీరోయిన్ల పరంగానే కాకుండా.. ఓవరాల్‌గా సౌత్ ఇండియాలోనే (మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ అందరిలో కలిపి) అత్యధిక మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్న ఏకైక నటిగా సమంత సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోల క్రేజ్ వల్లే యూఎస్ఏలో మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తుంటాయి. కానీ, సమంత సోలో లీడ్‌గా (హీరోయిన్ ఓరియెంటెడ్) నటించిన చిత్రాల్లో మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో ఆమె నటించిన ‘యశోద’, ‘శాకుంతలం’ తరహాలోనే ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ కూడా కేవలం సమంత బ్రాండ్ ఇమేజ్‌తోనే నార్త్ అమెరికా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, ఈ రేర్ ఫీట్‌ను సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సమంత మార్కెట్ స్టామినాకు ఈ రికార్డు ఒక నిదర్శనమని, సౌత్ టు నార్త్ ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో ఈ కలెక్షన్ల వర్షం మరోసారి నిరూపించిందని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు.

