Site icon TeluguMirchi.com

Samantha : సమంత కొత్త సినిమా ‘మా ఇంటి బంగారం’ గ్రాండ్ లాంచ్!

Samantha

Maa inti bangaram
Samantha : ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 2గా రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని మేకర్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ ఏడాది ఇదే బ్యానర్ నుంచి విడుదలైన ‘శుభం’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, కొత్త ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో సమంత, దిగంత్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటి గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిర్మాతలుగా సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ తర్వాత సమంత – నందినీ రెడ్డి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని ఓం ప్రకాష్, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను సీతా మీనన్, వసంత్ మరింగంటి రాశారు. పల్లవి సింగ్ కాస్ట్యూమర్‌గా, ఉల్లాస్ హైదర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆత్మీయ వాతావరణంలో చిత్ర లాంచ్ జరిగింది. విడుదలైన ఫస్ట్ లుక్‌ను చూస్తే ఇది ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నామని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ ప్రారంభమైందని, త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తామని వారు వెల్లడించారు.

Exit mobile version