Site icon TeluguMirchi.com

డబుల్ ఓటీటీ, డబుల్ ఇంపాక్ట్: సంతాన ప్రాప్తిరస్తు’కు వారం లోనే 50 మిలియన్ వ్యూస్…

Santhana prapthirasthu
ఇంట్లో ఈ వీకెండ్ అందరూ కలిసి కూర్చుని హాయిగా నవ్వుకుంటూ చూసే ఒక మంచి సినిమా కోసం చూస్తున్నావా? అయితే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ నీకే పర్ఫెక్ట్ ఆప్షన్. పక్కా మన నేటివిటీతో తెరకెక్కిన స్వచ్ఛమైన తెలుగు ఫ్యామిలీ డ్రామా ఇది. ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ లేకుండా అమ్మ, నాన్న, పిల్లలు కలిసి హ్యాపీగా చూసేయొచ్చు. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో ఉండే చిన్నచిన్న గొడవలు, అప్యాయతలను చాలా సహజంగా చూపించారు. ముఖ్యంగా హీరో పడే తిప్పలు, నేచురల్ డైలాగ్స్ నవ్విస్తూనే మనసుకు హాయినిస్తాయి.

కథలోకి వెళ్తే… భార్యను విడదీయలేరని మామగారితో చేసిన ఛాలెంజ్‌లో భాగంగా హీరో పిల్లల్ని కనాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ పిల్లల్ని కనడమే సమస్య అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? సమాజంలో పెరుగుతున్న ఓ సీరియస్ సమస్యనే కథకు బేస్‌గా తీసుకుని, డైరెక్టర్ దీన్ని ఫన్నీగా, ఎంటర్టైనింగ్‌గా చూపించాడు. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ రంగంలో కూడా ఓ ల్యాండ్‌మార్క్ మూమెంట్‌ను క్రియేట్ చేసింది. Big Fish Cinemas ఒక అరుదైన ప్రయత్నంగా Amazon Prime Videoతో పాటు Jio Hotstarలో ఒకేసారి సినిమాను రిలీజ్ చేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు, కేవలం ఒక వారం లోనే రెండు ప్లాట్‌ఫాంల్లో కలిపి 50 మిలియన్ వ్యూస్ సాధించి సెన్సేషన్ అయింది. ఇది కేవలం రిలీజ్ స్ట్రాటజీ కాదు, Big Fish యొక్క స్కేల్, కాన్ఫిడెన్స్, విజన్‌కు నిదర్శనం—భాషలు, ప్రాంతాలకతీతంగా ప్రేక్షకులను కేంద్రంగా ఉంచిన నిర్ణయం.

Exit mobile version