Site icon TeluguMirchi.com

Santosham Awards 2025 : ‘సంతోషం అవార్డ్స్’కు సీఎం చంద్రబాబును ఆహ్వానించిన సురేష్ కొండేటి

Santhosham award invitation
సినీ పరిశ్రమలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ గత 24 ఏళ్లుగా సంతోషం అవార్డ్స్‌ను ఘనంగా నిర్వహిస్తున్న సంతోషం మాగజైన్ అధినేత సురేష్ కొండేటి, ఈ ఏడాది కూడా ఆగస్టు 16న హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ మరియు సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య నాయకులను ఆహ్వానిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ, ఇలాంటి అవార్డు కార్యక్రమాలు ప్రతిభకు ప్రోత్సాహకమని సీఎం అభినందించారు.

ఈ ఏడాది అవార్డ్స్ కార్యక్రమానికి మ్యూజిక్ పార్ట్నర్‌గా ఆదిత్య మ్యూజిక్, అలాగే సూర్య సిమ్, విజయ వారాహి మూవీస్, వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వెన్ లాక్ గ్రూప్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. ఈసారి వేడుక ఆకాశాన్నంటేలా ఉండబోతుందని, టాలీవుడ్‌తో పాటు ఇతర భాషా సినీ పరిశ్రమల నుండి కూడా విశేషమైన సహకారం అందుతోందని సురేష్ కొండేటి తెలిపారు.

Exit mobile version