
Sapthami Gowda : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది. “సంక్రాంతికి వస్తున్నాం” వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా రత్న పాత్రలో నటించిన సప్తమి గౌడ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
“కాంతార” తర్వాత “తమ్ముడు” కోసం దర్శకుడు శ్రీరామ్ వేణు గారి నుండి కాల్ వచ్చిందని చెప్పిన సప్తమి, హైదరాబాదుకు వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చానని తెలిపారు. “రత్న” అనే పవన్ కల్యాణ్ అభిమాని అమ్మాయి పాత్ర కోసం హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నానని, అరకులో జరిగిన షూటింగ్ సమయంలో గుట్టలు, కొండల్లో రైడింగ్ సీన్స్ తీయడం సవాలుగా అనిపించినప్పటికీ, చివరికి అవి బాగా వచ్చాయని తృప్తిగా ఉంది” అన్నారు. “నాది లెంగ్తీ రోల్ కాదు, కానీ ప్రేక్షకుల మీద తప్పకుండా ప్రభావం చూపించే క్యారెక్టర్,” అని పేర్కొన్నారు. లయ, నితిన్ ఉన్న జర్నీలో రత్న పాత్ర ఎలా కలిసిపోతుందో ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు.
సప్తమి గౌడ మాట్లాడుతూ, “‘తమ్ముడు’లోని ఫైవ్ ఫీమేల్ క్యారెక్టర్స్‌కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కో క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది. లయ గారు స్ట్రిక్ట్ ఆఫీసర్, వర్ష ఫైటింగ్ సీన్స్‌తో, గుత్తి బస్ డ్రైవర్ పాత్రతో ఆకట్టుకుంటారు. హీరోయిన్ అంటే హీరోతో పాటలు పాడే పాత్ర అని కాదు – ఈ సినిమాలో ఫైట్ చేసే హీరోయిన్స్ కనిపిస్తారు. ఇదే కారణంగా థియేటర్స్‌లో మహిళా ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతారని భావిస్తున్నాను,” అన్నారు. “‘తమ్ముడు’ ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్, అలాగే మంచి కథతో కూడిన సినిమా కూడా. దిల్ రాజు గారి బ్యానర్‌లో నా తొలి తెలుగు సినిమా కావడం గర్వంగా ఉంది. ప్రస్తుతం తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తున్నా – త్వరలో వివరాలు చెబుతా,” అని తెలిపారు.
