Site icon TeluguMirchi.com

Rao Bahadur: ‘రావు బహదూర్’ డిజిటల్ రైట్స్ రేట్ ఎంతో తెలుసా?

Rao Bahadur

Rao Bahadur: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ – వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. జూలై 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే ఓటీటీ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ‘రావు బహదూర్’ ఓటీటీ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందట.

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ తీవ్రమైన మందగమనంలో ఉంది. పెద్ద సినిమాలకు కూడా డిజిటల్ బిజినెస్ క్లిష్టంగా మారిన ఇలాంటి తరుణంలో.. ‘రావు బహదూర్’ చిత్రానికి నెట్‌ఫ్లిక్స్ రూ.7 కోట్లు వెచ్చించడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ డీల్‌లో ఒక ఆసక్తికరమైన కండిషన్ కూడా ఉందట. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తే.. ఆ వసూళ్లను బేరీజు వేసుకుని నెట్‌ఫ్లిక్స్ సంస్థ మేకర్స్‌కు మరికొంత అదనపు మొత్తాన్ని కూడా చెల్లించనుందని సమాచారం. ఎలా చూసుకున్నా ఈ సినిమా డిజిటల్ రైట్స్ విలువ రూ.10 కోట్లకు తగ్గదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో సత్యదేవ్ సినిమాకు ఈ రేంజ్ ఆఫర్ రావడం చాలా పెద్ద విషయమని అంటున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి క్లాసిక్ తర్వాత వెంకటేష్ మహా సుదీర్ఘ కాలం పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేయగా.. తాజాగా జరిగిన ఓటీటీ బిజినెస్ మేకర్స్‌లో మరింత జోష్ నింపిందని చెబుతున్నారు.

Exit mobile version